నిరుద్యోగులకు ఇంపాక్ట్ సొల్యూషన్స్ టోకరా...

Thu,April 25, 2019 07:11 AM

ఖైరతాబాద్ : సాఫ్ట్‌వేర్, ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆ సంస్థ యజమానులు వందలాది మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.... ఢిల్లీకి చెందిన మోహిని పంజాగుట్టలోని ద్వారకాపురి శివసాయి సన్నిధి అపార్టుమెంట్‌లో నివాసం ఉంటుంది. మరో సహచరి సంజనాతో కలిసి డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో నిరుద్యోగులను టార్గెట్ చేశారు. డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి.. ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఇంపాక్ట్ కన్సల్టెన్సీ పేరుతో ఆన్‌లైన్ పోర్టల్ క్వికర్‌లో ప్రకటన ఇచ్చారు. దీంతో వందలాది మంది రూ.1000 నుంచి రూ.1.500, రూ.2వేలకు పైగా ఇచ్చారు. అయితే ఎంతకీ ఉద్యోగాలు కల్పించకపో వడంతో.. పలుమార్లు అడిగితే కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిర్వాహకురాలు మోహినిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

1772
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles