ఎంపీ కవితకు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ఐఐటీ విద్యార్థి

Wed,March 13, 2019 05:33 PM

IIT student unique wishes to mp kavitha on her birthday

సిద్దిపేట: ఎంపీ కవితకు ఐఐటీ విద్యార్థి వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. హుస్నాబాద్‌కు చెందిన మహేందర్‌కు రెండేండ్ల క్రితం మద్రాస్ ఐఐటీలో సీటు వచ్చింది. కానీ అక్కడ ఫీజు కట్టే స్థోమత లేక ఐఐటీ చదువుపై మహేందర్ ఆశలు వదిలేసుకున్నాడు. అయితే.. మీడియా ద్వారా మహేందర్ గురించి తెలుసుకున్న ఎంపీ కవిత, మహేందర్ చదువు కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలని తన కార్యాలయ సిబ్బందికి తెలిపారు. అప్పటి నుంచి ఐఐటీలో మహేందర్ కోర్సు ఫీజుతో పాటు అక్కడ మహేందర్ ఉండటానికి హాస్టల్‌కు అయ్యే ఖర్చులను కూడా తెలంగాణ జాగృతి సంస్థ చెల్లిస్తోంది. ఇవాళ కవిత పుట్టిన రోజు సందర్భంగా తనకు చేసిన మేలును గుర్తు చేసుకుంటూ మహేందర్ వీడియో సందేశం ద్వారా వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

5653
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles