పెద్దపల్లి, మెదక్ లో ఇఫ్తార్ విందు..

Mon,June 19, 2017 08:44 PM


పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో ప్రభుత్వం తరపున ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డితోపాటు జిల్లాకు చెందిన ముస్లిం కుటుంబాలు, ప్రజాప్రతినిధులు, పలువురు నేతలు హాజరయ్యారు.

మెదక్ లో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ భారతి, ఎస్పీ చందన దీప్తి, పలువురు నేతలు హాజరయ్యారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓసీ క్లబ్ లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన దావాతే ఇఫ్తార్ లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ , కలెక్టర్ ప్రీతిమీనా, జిల్లాకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.

267

More News

మరిన్ని వార్తలు...