పేలిన బాంబు: జవానుకు గాయాలు

Fri,November 22, 2019 10:04 PM

చర్ల రూరల్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా టారెం అటవీప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీ బాంబు పేల్చారు. ఘటనలో ఓ జవాను గాయపడ్డారు. బీజాపూర్ ఎస్పీ దివ్యాంగ్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లాలో శనివారం ముఖ్యమంత్రి భూపేశ్ బాగెల్ పర్యటన నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత బాసగూడ అటవీప్రాంతంలో మావోయిస్టు చర్యల కట్టడిలో భాగంగా 168వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ జవాన్లు ఏరియా డామినేషన్ చేపట్టారు.


పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు భూమిలో అమర్చి ఉంచిన ఐఈడీ పేలడంతో సీఆర్పీఎఫ్ బృందంలోని మున్నా కుమార్ మౌర్య అనే జవాన్ గాయపడ్డారు. ఐఈడీపై పొరపాటున కాలు వేయడంతో బాంబు పేలింది. ఘటన నేపథ్యంలో పోలీసు బలగాలు భారీగా మోహరించి బాసగూడ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటన నేపథ్యంలో తెలంగాణ సరిహద్దు చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా పారత్‌పూర్‌లో రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న పొక్లెయిన్‌ను శుక్రవారం మావోయిస్టులు దహనం చేసినట్లు సమాచారం.

298
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles