26 మంది ఐఏఎస్‌, 23 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు

Tue,April 23, 2019 02:44 PM

IAS and IPS officers got Promotions by Telangana Govt

హైదరాబాద్‌ : రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్‌, 23 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో 49 మంది ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం 15 జీవోలు జారీ చేసింది. ముగ్గురు ఐఏఎస్‌లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా, కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ముగ్గురికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా, ఒకరికి ముఖ్య కార్యదర్శి, నలుగురికి కార్యదర్శులుగా, మరో ఆరుగురికి అదనపు కార్యదర్శులుగా, ఐదుగురు ఐఏఎస్‌లకు సంయుక్త కార్యదర్శులుగా, నలుగురు ఐఏఎస్‌లకు డిప్యూటీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం. ఐదుగురు ఐపీఎస్‌లకు అదనపు డీజీలుగా, నలుగురు ఐపీఎస్‌లకు ఐజీలుగా, మరో ఏడుగురు ఐపీఎస్‌లకు డీఐజీలుగా, ఆరుగురు ఐపీఎస్‌లకు సీనియర్‌ స్కేల్‌ అధికారులుగా, కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరొక అధికారికి ఐజీగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

1738
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles