సీఎం కేసీఆర్ ప్రకటనను సవినయంగా స్వీకరిస్తున్నా: కేటీఆర్

Sat,January 30, 2016 10:44 PM

iam receiving responsibility of hyderabad development ktr

హైదరాబాద్: హైదరాబాద్ నగరాభివృద్ధి బాధ్యతను పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు అప్పగిస్తానని ఇవాళ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన టీఆర్‌ఎస్ ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం వ్యాఖ్యలపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. సీఎం కేసీఆర్ ప్రకటనను సవినయంగా స్వీకరిస్తున్నానని తెలిపారు. సీఎం తనకు అప్పగించిన గురుతర బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానన్నారు. హైదరాబాద్ నగరంలో పెరిగిన పౌరుడిగా తన బాధ్యత అని వివరించారు. తాను మూడు నెలల కాలంలో నగరంలో విస్తృతంగా పర్యటించడంతో నగర ప్రజల సమస్యలు తెలిశాయన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. ఐటీ మంత్రిగా వివిధ వర్గాల ప్రజలను దగ్గర నుంచి చూశానని, ప్రజలతో కలిసి తిరిగినపుడు వాళ్ల అవసరాలేంటో తెలిశాయన్నారు. ప్రజల అవసరాలన్నింటినీ మేనిఫెస్టోలో పెట్టామని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీ అమలు బాధ్యతను తీసుకుంటానని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ప్రయత్నానికి ప్రజల మద్దతు కావాలని విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు.

1669
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles