తుది శ్వాసవరకు రాజకీయాల్లో ఉంటూ పోరాడుతా..

Thu,May 23, 2019 09:26 PM

i will fight in politics untill my final breath says pawankalyan


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..తాను సుదీర్ఘకాలం మార్పు కోసం జనసేన పార్టీ పెట్టానన్నారు. తాము ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడ్డామని చెప్పిన పవన్..పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. భారీ మెజార్టీ సాధించి..సీఎం కాబోతున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి పవన్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రెండోసారి ప్రధాని అవుతున్న నరేంద్ర మోదీకి కూడా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు.

కేంద్రంలో, రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన పార్టీలు ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. జనసేన పార్టీ ద్వారా డబ్బులు, సారా పంచకుండా నూతన రాజకీయాలు చేశామని, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ద్వారా కొత్తవారికి అవకాశం కల్పించామని వెల్లడించారు. తాను రెండు స్థానాల్లో గెలవకపోయినా తన తుది శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటూ పోరాడతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

5011
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles