నేనెప్పుడూ సాధారణ వ్యక్తినే : కేటీఆర్

Wed,August 14, 2019 12:51 PM

I never did that even when I was a minister brother ktr retweet to Rakesh Varma

హైదరాబాద్‌ : గత ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక సాధారణ వ్యక్తి మాదిరిగానే ట్రాఫిక్‌లో ప్రయాణించానని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం వీఐపీల కోసం వినియోగించే బుగ్గ కార్లను నిషేధించక ముందు కూడా బుగ్గ కారును ఉపయోగించలేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాకేశ్‌ వర్మ అనే వ్యక్తి కేటీఆర్‌కు ట్వీట్‌ చేస్తూ.. సార్‌ మీరు పంజాగుట్ట, బంజారాహిల్స్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ రద్దీ బాగా ఉన్న సమయాల్లో కూడా ఆ ట్రాఫిక్‌లోనే ప్రయాణించారు. మీరు ప్రయాణించిన సమయంలో ఎప్పుడు కూడా ట్రాఫిక్‌ను ఆపలేదు అని అతను ట్వీట్‌ చేశాడు. అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానని రాకేశ్‌ వర్మ కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. రాకేశ్‌ ట్వీట్‌కు కేటీఆర్‌ పైవిధంగా బదులిచ్చారు.2121
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles