ఓటమి అంటే ఏమిటో తెలియదు: హరీశ్‌రావు

Fri,November 16, 2018 07:01 PM

I dont know what is defeat says minister harish rao

జోగులాంబ గద్వాల: జీవితంలో తనకు ఓటమి అంటే ఏమిటో తెలియదని రాష్ర్ట మంత్రి హరీశ్‌రావు అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా గెలుపు ఖాయమని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో శుక్రవారం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి అబ్రహం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న లిఫ్టులను బాగు చేసుకోవాలన్నారు. ఆలంపూర్‌కు మూడు రిజర్వాయర్లు మంజూరు చేసుకున్నం. ప్రభుత్వం ఏర్పాటు కాగానే రిజర్వాయర్ల పనులు మొదలుపెడదాం. ఆలంపూర్ తలరాత మారాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలివాలన్నారు. కేంద్రంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో బోయలకు రిజర్వేషన్లు సాధించుకుందామని చెప్పారు. ఆలంపూర్‌లో వంద పడకల ఆస్పత్రి కట్టడానికి మూడెకరాల స్థలం సేకరించాం. త్వరలోనే ఆలంపూర్ మార్కెట్ యార్డు సమీపంలో ఈ వందపడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

2877
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles