మెజార్టీ పిచ్చి లేదు.. సోకు లేదు.. : కేటీఆర్

Sat,September 22, 2018 04:00 PM

I do not want Majority I want win says Minister KTR

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేటలో ఎన్నికల ప్రచారానికి మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. 2006 ఎన్నికల్లో తనకు సిరిసిల్లతో రాజకీయ పరిచయం ఏర్పడిందన్నారు. 2006లోనే తాను రాజకీయాలు, ఉద్యమంలోకి వచ్చాను అని గుర్తు చేశారు. 2009లో 171 ఓట్ల మెజార్టీ, 2010లో 68 వేల ఓట్ల మెజార్టీ, 2014లో 53 వేల ఓట్ల మెజార్టీతో తనను ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఇప్పుడేమో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని చెబుతున్నారు. తనకు మెజార్టీ పిచ్చి లేదు.. సోకు లేదు.. మెజార్టీ ముఖ్యం కాదు.. గెలుపు ముఖ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు.

నాకు రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల రుణం తీర్చుకుంటున్నాను. ఈ నాలుగేళ్లలో సిరిసిల్ల రూపురేఖలు మారిపోయాయి. నాలుగేళ్లలో సిరిసిల్ల ఎంత అభివృద్ధి జరిగిందో ప్రతిపక్షాలు గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పదింతలు అభివృద్ధి చేసి చూపిస్తాను అని చెప్పారు. రాబోయే మూడేండ్లలోనే సిరిసిల్లకు రైలు తీసుకువస్తానని కేటీఆర్ హామీనిచ్చారు. తన నియోజకవర్గ ప్రజలు తనను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతాం. సీఎం కేసీఆర్‌కు ప్రజల్లో బలమైన విశ్వాసం ఉందన్నారు కేటీఆర్.

3801
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles