బీజేపీ గెలిస్తేనట.. కరీపురంగా కరీంనగర్!

Thu,December 6, 2018 12:21 PM

Hyderabad will be Bhagyanagar and Karimnagar as Karipuram if BJP wins says Yogi Adityanath

హైదరాబాద్ : తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రెండు పట్టణాల పేర్లను మార్చేస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలో నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించిన యోగి.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ బీజేపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కరీంనగర్ పేరును కరీపురంగా మారుస్తామని చెప్పారు. అంతే కాదు హైదరాబాద్ పేరును కూడా భాగ్యనగరంగా మారుస్తామని నిజామాబాద్‌లోని బోధన్ పట్టణంలో నిర్వహించిన సభలో సీఎం యోగి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో ఫైజాబాద్‌ను అయోధ్య, అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన విషయాన్ని యోగి గుర్తు చేశారు. పట్టణాల పేర్లనే కాదు.. మొఘల్‌సరాయి రైల్వే జంక్షన్ పేరును పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌గా మార్చారు.

2809
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles