అటవీ ఉద్యానవనాల ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ శ్రీకారం

Mon,July 30, 2018 07:50 AM

Hyderabad urban forests to be turned into parks

హైదరాబాద్ : అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతున్న హైదరాబాద్‌ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఆరోగ్యం, ఆహ్లాదం కోరుకునే వారీ కోసం హెచ్‌ఎండీఏ 17 ప్రాంతాల్లో ఆటవీ ఉద్యానవనాలు (అర్బన్ ఫారెస్ట్ బ్లాక్) ఏర్పా టు చేయాలని నిర్ణయించింది. 6604 ఎకరాల్లో రూ. 106.92కోట్ల అంచనా వ్యయంతో వీటి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా తొలి విడతలో ఐదు ప్రాంతాలను గుర్తించింది.

పల్లెగడ్డ (శంషాబాద్), మన్యంకంచె, సంగారెడ్డి, తుర్కపల్లి, కమ్మదనం ప్రాంతాలలో అర్భన్ ఫారెస్ట్ బ్లాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇంజనీర్ల విభాగం ఈ ఐదు ప్రాంతాలలో ప్రతిపాదిత ప్రాంతం చుట్టూ చైన్ లింకు ఏర్పాటు చేయనున్నా రు. అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అధికారులు ఈ ఐదు చోట్ల లక్ష మొక్కలను నాటనున్నారు. వచ్చే నెల 2వ తేదీన ఈ పనులను ప్రారంభించనున్నారు. లేబర్ ఇంటెన్సీవ్ మెథడ్ పద్ధతిలో ఈ పనులు జరగనున్నాయి.

బీడు భూములుగా ఉన్న ప్రాంతాలు ఉద్యానవనాలుగా మారబోతున్నాయి. గుబురు పొదలతో, చెత్త చెదారాలతో వృథాగా ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతా లు ప్రకృతి రమణీయ వాతావారణాన్ని సంతరించుకోనున్నాయి. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఔటర్ కేంద్రంగా అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లు (పట్టణ లంగ్ స్సేస్‌లు) ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హెచ్‌ఎండీఏ అన్నీ ఏర్పాట్లు చేసింది.

సంగారెడ్డ్లి 65 హెక్టార్లు, కమ్మదనంలో 20 హెక్టార్లు, మన్నెంకంచెలో 18 హెక్టార్లు, పల్లెగడ్డలో 5 హెక్టార్లు, తుర్కపల్లిలో 0.5హెక్టార్ల విస్తీర్ణంలో ఈ అర్భన్ ఫారెస్ట్రీ బ్లాక్‌లు ఏర్పాటు చేయనున్నారు. స్థానిక ప్రజల నడక కోసం వాకింగ్ పాత్‌వేలను సైకిలింగ్ కోసం సైకిల్ ట్రాక్ లు, పిల్లలు ఆడుకునే విధంగా చిల్డ్రన్‌కార్నర్‌లు రానున్నాయి. యోగాసెంటర్‌లను, జనం కూర్చొవడానికి భారీ వృక్షాల కింద రచ్చబండలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

869
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles