క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్

Fri,July 12, 2019 08:56 AM

hyderabad task force police arrested cricket betting gang

హైదరాబాద్ : క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌కు చెందిన నట్వర్‌దారక్ కుటుంబం 15 సంవత్సరాల కిందట హైదరాబాద్‌కు వలస వచ్చి అఫ్జల్‌గంజ్‌లో ధాన్యాల విక్రయ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌లపై ఆసక్తి పెంచుకోవడంతో వ్యాపారంలో నష్టపోయాడు. దీంతో అతను క్రికెట్ బెట్టింగ్ దందాను ప్రారంభించాడు. దీని కోసం గుజరాత్‌లోని అతని స్నేహితుడైన సరూజ్ పటేల్ నుంచి లైన్ తీసుకుని బుకీగా మారాడు. పందెంరాయుళ్ల నుంచి డబ్బును వసూలు చేసేందుకు రమేష్‌ను ఏజెంట్‌గా పెట్టుకున్నాడు. డైమండ్ ఎక్సేంజ్ క్రికెట్ యాప్ ద్వారా పందెం రాయుళ్ళకు బెట్టింగ్ ధరలను పంపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.45వేల నగదు, టీవీ, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

406
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles