భాగ్యనగరంలో భానుడి భగభగ

Tue,May 7, 2019 01:06 PM

Hyderabad sizzles at 42 degree celsius

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం రోజు నగరంలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ కూడా ఎండలు దంచికొడుతున్నాయి. వేడిమిని తట్టుకోలేక ప్రజలు విలవిలలాడుతున్నారు. ఆదివారం 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, సోమవారం 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత, బాలానగర్‌లో 42 డిగ్రీలు, షాపూర్‌నగర్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత మూడు రోజుల నుంచి ఎండలు ఎక్కువయ్యాయని.. రాబోయే రోజుల్లో కూడా ఎండలు అధికమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వేళలో బయటకు వెళ్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

2634
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles