హెడ్ కానిస్టేబుల్ అదృశ్యం

Thu,February 8, 2018 05:13 PM

Hyderabad Police constable goes missing

హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిసున్న టి. సంగప్ప అగుపించకుండా పోయాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవజీవన్ నగర్ పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉండే సంగప్ప అనారోగ్యం కారణంతో రెండు రోజుల సెలవుపై వెళ్లాడు. కాగా పది రోజులైన అతడు విధుల్లో చేరలేదు. బుధవారం నాడు ఆయన భార్య నిర్మల వచ్చి భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన సంగప్ప ఇప్పటివరకు తిరిగిరాలేదన్నారు. మొబైల్ ఫోన్ స్విచ్ఛ్‌ఆప్ వస్తుందని తెలిపారు.

1556
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles