మెట్రోరైల్‌కూ స్వర్ణ పతకం

Thu,December 6, 2018 10:11 PM

hyderabad Metro Rail got gold medal


హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి ప్రతిష్టాత్మక ఇంటర్నెషనల్ లీడర్‌షిప్ ఇన్నోవేషన్ ఎక్స్‌లెన్స్ అవార్డును ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్(ఐఈఎస్) నుంచి అందుకున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ సైతం స్వర్ణ పతకాన్ని పొందింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఇటీవల నిర్వహించిన ఇంటర్నెషనల్ ఎకనామిక్ సమ్మిట్‌లో భాగంగా ఈ అవార్డును అందజేసింది. థాయ్‌లాండ్ మాజీ డిప్యూటీ ప్రధాని కోర్న్ దబ్బారాన్సి ఈ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఎకనామిక్ స్టడీస్ నుంచి ఈ అవార్డును అందుకోవడం గౌరవంగా ఉందన్నారు. ఈ అవార్డు హైదరాబాద్ మెట్రో రైల్ విజయాన్ని సూచిస్తుందని, ఇటీవల పూర్తి చేసుకున్న మెట్రో రైల్ మొదటి వార్షికోత్సవానికి జ్ఞాపకార్థంగా నిలుస్తుందని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సమకాలీన వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలను పరిష్కరించడం, భారతదేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్‌ను అభినందిస్తున్నట్టు తెలిపారు.

985
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS