అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ మెట్రో మార్గం ప్రారంభం..

Wed,March 20, 2019 09:51 AM

హైదరాబాద్‌: అమీర్‌పేట్‌-హైటెక్‌ సిటీ మెట్రో రైల్‌ మార్గం అందుబాటులోకి వచ్చింది. అమీర్‌పేట్‌ ఇంటర్‌ఛేంజ్‌ మెట్రోస్టేషన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి ఈ మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 10కి.మీ మార్గంలో అమీర్‌పేట్‌తో కలిపి 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. మధురానగర్‌ స్టేషన్‌కు తరుణి మెట్రో స్టేషన్‌గా నామకరణం చేశారు. పూర్తయిన రెండు కారిడార్లతో కలిపి మొత్తం 56కి.మీ మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్యక్రమంలో సీఎస్‌ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, మెట్రోరైల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రయాణ సమయం ఇలా..


కారిడార్ 1 : - మియాపూర్ నుంచి ఎల్బీనగర్ (29 కిలోమీటర్లు) మెట్రో ప్రయాణంలో 45 నిమిషాలు పడుతుంది. ఇదే ప్రయాణం రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే గంట 46 నిమిషాలు పట్టే అవకాశముంది.

కారిడార్ 2 : - జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు(15 కిలోమీటర్లు) మెట్రో ప్రయాణంలో 22 నిమిషాలు పడుతుంది. ఇదే ప్రయాణం రోడ్డు మార్గంలో గంట 10 నిమిషాలు పడుతుంది.

కారిడార్ 3 : - నాగోల్ నుంచి హైటెక్‌సిటీ (27 కిలోమీటర్లు) మెట్రో ప్రయాణంలో 38 నిమిషాలు పడుతుంది. ఇదే ప్రయాణం రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే గంట 26 నిమిషాలు పడుతుంది.

3525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles