అన్నీ తామై.. ముందుండి నడిపించి..!

Mon,September 3, 2018 07:34 AM

- ప్రగతి నివేదన విజయవంతంలో నగర నేతల సమష్టి కృషి
- సభా నిర్వహణ కమిటీల్లో కీలక బాధ్యతలు

హైదరాబాద్: ప్రగతి నివేదక సభ సూపర్ సక్సెస్ అయింది. నేతల శ్రమ.. సమష్టి కృషి ఫలితమే ఈ సభ విజయవంతమైంది. కొంగరకలాన్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించి వెనువెంటనే సభ విజయవంతానికి ఎనిమిది కమిటీలను నియమించారు. ఆగస్టు 22నే సభా వేదికను ఖరారు చేయడం, సభకు కేవలం పది రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో నేతలంతా రేయింబవళ్లు శ్రమించి ప్రగతినివేదనకు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా సభ జరుగుతున్న రంగారెడ్డి జిల్లా, సరిహద్దు జిల్లా హైదరాబాద్ జిల్లా నేతలకు ఈ కమిటీలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. సభా నిర్వహణ కమిటీల్లో నగర నేతలకే కీలక బాధ్యతలు అప్పగించారు. సభ సమన్వయకర్తలుగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి వ్యవహరించారు.

సభా ప్రాంగణం, పార్కింగ్ కమిటీ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బల్దియా మేయర్ బొంతు రామ్మోహన్, వలంటీర్స్ కమిటీగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, దినేశ్‌చౌదరి, మంచినీరు, ఇతర సౌకర్యాల కమిటీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎంపీ మల్లారెడ్డి, నగర అలంకరణ కమిటీలో మాజీ మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్సీలు మైనంపల్లి హన్మంతరావు, ప్రభాకర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఫొటో ఎగ్జిబిషన్ కమిటీలో ఎన్ ధర్మేందర్, కర్నాటి విద్యాసాగర్, హైదరాబాద్ నగర జన సమీకరణ సమన్వయ కమిటీలో మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, మాజీ మంత్రి దానం నాగేందర్ సభా విజయవంతంలో
కీలకంగా వ్యవహరించారు.
2965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles