హెచ్‌ఐసీసీలో కొలువుదీరిన బొమ్మల ప్రపంచం

Sun,October 13, 2019 08:27 AM

హైదరాబాద్ : చిన్నారుల ప్రపంచం హెచ్‌ఐసీసీలో కొలువుదీరింది. కామిక్‌కాన్ శనివారం ప్రారంభమయింది. విచిత్ర వేషధారణల్లో కాస్‌ప్లేయర్లు అలరించారు. సూపర్‌మ్యాన్, ఐరన్ మ్యాన్, శక్తిమ్యాన్.. అవతార్, హరిపోర్టర్, రోబో తదితర గెటప్‌లలో ఆకట్టుకున్నారు. చిన్నారుల బొమ్మల పండుగకి కుటుంబ సమేతంగా హాజరై నగరవాసులు కామిక్‌కాన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సుమారు 15 వందల మంది షోకు హాజరయ్యారు. నేడు కూడా కామిక్‌కాన్ అలరించనుంది.


ఆకట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు..


బిజీబిజీగా ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కామిక్‌కాన్ షోకు హాజరై విచిత్ర వేషధారణలో అలరించారు. బొమ్మల పండుగని సంతోషంగా జరుపుకున్నారు. వివిధ వేషధారణల్లో కామిక్‌కాన్ షోలో తిరుగుతూ ఆకట్టుకున్నారు. వారితో సెల్ఫీలు దిగుతూ చిన్నారులు సందడి చేశారు.

అదో బొమ్మల ప్రపంచం..!!


ప్రతి స్టాల్.. చిన్నారుల చూపులను తిప్పుకోకుండా చేస్తుంది. కామిక్‌కాన్ బొమ్మలు.. స్టిక్కర్లు.. పిల్లలకు నచ్చే కీ చైన్లు.. కాస్‌ప్లేయర్స్ అవతారానికి కావాల్సిన వస్తువులు, మేకప్ కిట్స్.. మొత్తంగా చిన్నారులు బొమ్మల ప్రపంచంలో ఎంజాయ్ చేశారు. కామిక్‌కాన్‌లో డిస్నీల్యాండ్ ఏర్పాటు చేసి.. సందర్శకులు సెల్ఫీలు తీసుకొనే అవకాశాన్ని ఇచ్చారు. దసరా సెలవులు నేపథ్యంలో సందర్శకుల సంఖ్య కామిక్‌కాన్ షోకు అధికంగా ఉన్నది. టికెట్ ధర రూ. 800గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే 6 వందలు ఛార్జీ చేస్తున్నారు.

442
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles