హైదరాబాద్ ఎప్పటికి రెండో రాజధానే: కేటీఆర్

Thu,January 18, 2018 03:35 PM

Hyderabad has always been the 2nd capital of India

హైదరాబాద్: హైదరాబాద్ ఎప్పటికి దేశానికి రెండో రాజధానిగానే కొనసాగుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని పార్క్ హయత్ హోటల్‌లో ఇండియాటుడే సౌత్‌కాంక్లేవ్-2018 సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. చర్చా గోష్ఠి సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్‌దేశాయ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతీసారి తాను ఆశ్చర్యానికి గురౌతున్నట్లు చెప్పారు. ఢిల్లీ కంటే హైదరాబాద్ మెరుగైన అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశానికి రెండు రాజధానులు ఉండాలని అది హైదరాబాదే కావాలని అభిప్రాయపడుతూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాజ్‌దీప్ మీకో విషయం గుర్తుచేయదలచుకున్నా. దేశంలో ఢిల్లీ తర్వాత రాష్ట్రపతి నిలయం ఉన్న ఏకైక నగరం హైదరాబాద్. శీతాకాల విడిది నిమిత్తం ప్రతిఏటా భారత్ రాష్ట్రపతి ఈ మహానగరానికి విచ్చేస్తుంటారు. అధికారికంగా ప్రకటించనప్పటికీ హైదరాబాద్ దేశానికి ఎప్పుడూ రెండో రాజధానిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.5255
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles