సిటీ పోలీస్ సూపర్ పోలీస్ : సీఎం కేసీఆర్Fri,May 19, 2017 03:14 PM

Hyderabad City police is doing good job-says CM KCR

సీఎం కేసీఆర్ కితాబు
హైదరాబాద్ సిటీ పోలీసులపై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. సీపీ మహెంద‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ పోలీసులు బాగా ప‌నిచేస్తున్నార‌ని కేసీఆర్ కితాబునిచ్చారు. న‌గ‌రంలో షీ టీంలు వ‌చ్చిన త‌రువాత మ‌హిళ‌లు స్వేచ్ఛ‌గా వారి ప‌నులు చేసుకుంటున్నారు. గ‌తంలో పోలీసు శాఖ‌లో ఉన్న చెడు క‌ల్చ‌ర్ 99 శాతం పోయింద‌న్నారు.

సిటీలో పేకాట, గుడుంబా దందాలు దాదాపు క‌నుమ‌రుగ‌య్యాయ‌న్నారు. ఇందులో పోలీసులు పూర్తిగా స‌ఫ‌లీకృతుల‌య్య‌ర‌న్నారు. గుడుంబా అరిక‌ట్ట‌డంలో డీజీ అకున్‌ స‌బ‌ర్వాల్ ప‌నితీరుపై సీఎం పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. గ‌తంలో పోలీస్టేష‌న్ల‌లో కానిస్టేబుల్ కూర్చోవ‌డానికి కూడా కుర్చీలు ఉండేవి కాద‌ని, తెలంగాణ కొత్త రాష్ట్రంలో పోలీస్టేష‌న్ల రూపురేఖ‌లు మార‌య‌న్నారు.

రిసెప్ష‌న్ కౌంట‌ర్‌తో పాటు అత్యాధునిక వ‌స‌త‌లుతో సిటీ పోలీస్టేష‌న్లు న‌ర్మించామ‌న్నారు. రాష్ట్రం వ‌చ్చిన త‌రువాత అంద‌రికంటే ముందు పోలీసుల‌కే అత్యాధునిక వాహ‌నాలు స‌మ‌కూర్చామ‌ని, ఇంకా ఏదైనా ఆదునిక సాంకేతిక‌త గానీ, ఆయుధాలు గానీ కావ‌లిసి వ‌స్తే ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని అన్నారు. ఇందుకోసం మ‌రో 500 కోట్ల రూపాయ‌లు పోలీసు శాఖ‌కు కేటాయిస్తున్న‌ట్లు సీఎం వెల్ల‌డించారు.

స‌మాజంలో పేద‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన బాధ్య‌త పోలీసుల‌దేన‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెట్టుబ‌డులు హైద‌రాబాద్‌కు రావాలంటే ఇక్క‌డి లా అండ్ ఆర్డ‌ర్ ముఖ్య‌మ‌ని సీఎం అన్నారు. ఇత‌ర రాష్రాల నుంచి వచ్చి వ్యాపారం చేసుకుంటున్న పారిశ్రామిక వేత్త‌లు మ‌న సిటీ పోలీసుల ప‌ని తీరుపై సంతృప్తిగా ఉన్న‌ర‌ని, ఇదే ప‌నితీరు భ‌విష్య‌త్తులో కూడా కొన‌సాగాల‌ని సీఎం సూచించారు.

1477
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS