భార్య వైవాహిక జీవితానికి రావడం లేదని..

Fri,November 16, 2018 06:44 AM

HUSBAND SENDS OBJECTIONABLE PICS TO HIS WIFE LATER ARRESTED

హైదరాబాద్ : వైవాహిక జీవితానికి రావడం లేదని భార్యకు అశ్లీల, అభ్యంతకర మెసేజ్‌లను పంపిస్తున్న భర్తను రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ జలంధర్‌రెడ్డి వివరాల ప్రకారం..సరూర్‌నగర్ క్రాంతినగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి గతేడాది విశాఖపట్నం శివాజీపాలెంకు చెందిన సంజయ్‌తో వివాహం జరిగింది. వివాహ సమయంలో కాగ్నిజెంట్ ఉద్యోగినని చెప్పుకున్న సంయజ్ ఆ కంపెనీలో ఎప్పుడు ఉద్యోగం చేయలేదని భార్యకు తెలిసింది. దీంతో మనస్పర్థాలు ఏర్పడ్డాయి.

ఆ తర్వాత సంజయ్ భార్యను సింక్రోని ఇంటర్నేషనల్ సంస్థలో ఉద్యోగం మానిపించి బెంగళూరుకు తీసుకువెళ్లాడు. అక్కడ 10 రోజులు గడిచిన తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తూ ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఇలా కొద్దిరోజులు గడిచిన తర్వాత సంజయ్ భార్య ఫోన్‌కు అభ్యంతకరమైన, అశ్లీల మెసేజ్‌లను పంపుతూ వేధిస్తున్నాడు. మరికొన్నిసార్లు ఫోన్ చేసి భార్య, ఆమె తండ్రిని చంపేస్తానని బెదిరించాడు. ఈ చర్యలతో విసిగిపోయిన ఆమె రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దర్యాప్తులో భాగంగా సంజయ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తన భార్య వైవాహిక జీవితానికి రావడం లేదని, దీనిపై కోర్టును కూడా ఆశ్రయించినట్లు పోలీసులకు వివరించాడు. అతడి నుంచి పూర్తి ఆధారాలు సేకరించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

4849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles