భర్త సర్పంచ్.. భార్య ఎంపీపీ..!

Fri,June 7, 2019 08:45 PM

husband sarpanch and wife mpp in narayanapet dist

నారాయణపేట: జిల్లాలోని మక్తల్ మండలంలో భర్త సర్పంచ్ భార్య ఎంపీపీగా ఎన్నికైన అరుదైన ఘటన చోటు చేసుకున్నది. మండలంలోని పస్పుల గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ సీనియర్ నేత దత్తప్ప ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అయితే తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దత్తప్ప భార్య వనజమ్మ పంచదేవ్‌పహాడ్ ఎంపీటీసీగా గెలవడంతో పాటు శుక్రవారం నిర్వహించిన మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున మక్తల్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. దీంతో భార్య ఎంపీపీగా, భర్త సర్పంచ్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

5864
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles