భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని పాల్వంచ పట్టణంలోని సీతారాంపట్నం మారుతీనగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్యఅరుణపై అనుమానంతో ఆమె భర్త కందుకూరి శివ కర్రతో కొట్టి హత్య చేశాడు. వారి అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం నుంచి పారిపోయిన నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.