భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

Mon,June 17, 2019 09:12 PM

husband murdered his wife at tirumalagiri suryapet

తిరుమలగిరి : భర్త తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించగా తీవ్రంగా కాలి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మణెమ్మ(29)కు 2009లో అదే గ్రామానికి చెందిన ఉపేందర్‌తో వివాహం జరిగింది. వీరికి 5సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. కాగా, ఉపేందర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో తరచూ మద్యం తాగి వచ్చి భార్యను వేధించేవాడు. ఆదివారం రాత్రి బాగా తాగి వచ్చి భార్యతో గొడవపడి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలతో తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ఆమె ఈ రోజు మృతి చెందింది. మృతురాలి తల్లి ధనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డేనియల్‌కుమార్ తెలిపారు.

3924
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles