భార్యను చంపి భర్త ఆత్మహత్య

Tue,November 14, 2017 10:20 PM

Husband kills wife and committed suicide

మద్దూరు:కుటుంబ కలహాలతో భార్యను గొడ్డలితో నరకిచంపి భర్త బ్లేడ్‌తో గొంతును కోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆనందాసు ఉప్పలయ్య(62), ఆనందాసు సత్తెమ్మ(55) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉప్పలయ్య, సత్తెమ్మలు తరుచుగా ఇంట్లో గొడవపడేవారు. ఈ క్రమంలో రాత్రి భార్యతో గొడవపడిన ఉప్పలయ్య క్షణికావేశంలో నిద్రిస్తున్న సత్తెమ్మను గొడ్డలితో నరికి చంపాడు. తర్వాత ఉప్పలయ్య హైదరాబాద్‌లో ఉంటున్న పెద్ద కొడుకు భాస్కర్‌కు ఫోన్ చేసి మీ అమ్మను గొడ్డలితో నరికి చంపి, నేను కూడా చనిపోతున్నట్లు చెప్పి ఫోన్ పెట్టేశాడు.

అనంతరం ఉప్పలయ్య బ్లేడ్‌తో తన గొంతును కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో పాటు మానసిక స్థితి సరిగా లేక తన తల్లిని చంపి, తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని కొడుకు భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హుస్నాబాద్ ఏసీపీ మహేందర్‌తో పాటు సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ వీరేందర్‌లు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామాను నిర్వహించారు. పోస్టుమార్టంను నిర్వహించిన అనంతరం పోలీసులు మృతదేహాలను కుటుంబసభ్యులకు అందజేశారు.

1732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS