భార్యను హత్య చేసిన భర్త

Fri,May 24, 2019 10:47 PM

husband killed his wife in warangal rural dist

వర్ధన్నపేట: కుటుంబ కలహాలతో భార్యను గొడ్డలితో నరికి భర్త హత్య చేసిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామంలో వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సుక్క దూడయ్య, కొమురమ్మల కుమార్తె మల్లికాంబ(43)ను కట్య్రాల గ్రామానికి చెందిన చెవ్వళ్ల యాదగిరికి ఇచ్చి 25 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు.

వీరికి ప్రవీణ్(23), ప్రశాంత్(25) ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎనిమిదేళ్లక్రితం భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవతో మల్లికాంబ పెద్దకుమారుడు ప్రవీణ్‌ను తీసుకుని తల్లిగారింటి వద్దనే కొత్తూరులో జీవిస్తున్నది. భర్త యాదగిరి చిన్నకుమారుడు ప్రశాంత్‌తో కట్య్రాలలోనే ఉంటున్నాడు. భార్యభర్తలను కలిపేందుకు పెద్దమనుషులు, ఇరుకుటుంబాల పెద్దలు పలుమార్లు ప్రయత్నించారు. ఈక్రమంలోనే ఇటీవల పెద్దమనుషుల పంచాయితీ నిర్వహించి భార్యభర్తలు కలిసి ఉండాలని సూచించారు. దీంతో ఈనెల 16న మల్లికాంబ పెద్ద కుమారుడిని తీసుకుని కాపురానికి వచ్చింది. పెద్దకుమారుడు హైదరాబాద్‌లో పనిచేసేందుకు రెండు రోజుల క్రితం వెళ్లడంతో భార్యభర్తలు, చిన్నకుమారుడు ఇంట్లోనే ఉంటున్నారు.

ఈక్రమంలోనే గురువారం రాత్రి ప్రశాంత్ డాబాపైన పడుకోగా భార్యాభర్తలు ఇంట్లోనే ఉన్నారు. తెల్లవారే సరికి మల్లికాంబ హత్యకు గురై ఉండడంతో ప్రశాంత్ ఆందోళనకు గురై చుట్టుపక్కల వారికి చెప్పాడు. కాగా అర్ధరాత్రి మల్లికాంబను ఆమె భర్త గొడ్డలితో మెడపై బలంగా నరకడంతో మంచంలోనే మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానిక ఏసీపీ మధుసూదన్, సీఐ శ్రీనివాస్, ఎస్సై సంపత్ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతురాలి సోదరుడు సుక్క నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీ ఉన్నాడు.

5196
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles