భార్యను వేధించిన కేసులో భర్తకు జైలు...

Tue,February 26, 2019 07:05 AM

Husband jailed in case of harassing wife

రంగారెడ్డి :అదనపు కట్నం కోసం భార్యను వేధించిన కేసులో భర్త సాయికృష్ణకు ఏడాది జైలు శిక్ష, రూ.2000ల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు 14వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ క్షమాదేశ్‌పాండే సోమవారం తీర్పునిచ్చారు. ...బాల్కంపేటకు చెందిన సంధ్యకు హయత్‌నగర్ మండలం కవాడిపల్లికి చెందిన సాయికృష్ణతో 30 అక్టోబర్ 2013న వివాహం జరిగింది. పెండ్లి జరిగిన కొద్దిరోజుల తరువాత బాధితురాలిని అదనపు కట్నంకోసం మానసికంగా, శారీరకంగా వేధించారు. పలు మార్లు పెద్దల ముందు పంచాయితీ జరిగినా భర్త ప్రవర్తనలో మార్పు రాకపో వడంతో పాటు, ఆడపిల్ల పుట్టిందనికూడా వేధింపులు పెరగడంతో బాధితురాలు జనవరి 2016లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా విచారణ అనంతరం కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించింది.

1675
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles