భార్యపై వేధింపులు..భర్తకు ఏడాది జైలు

Fri,March 1, 2019 08:32 AM

Husband Jailed for assault on His Wife in Rangareddy


రంగారెడ్డి : అదనపు కట్నం కోసం భార్యను శారీరకంగా, మానసికంగా వేధించిన కేసులో నిందితుడు, భర్త అమృత్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు 14వ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ క్షమాదేశ్‌పాండే గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం ఎల్‌బీనగర్‌, ఆర్టీసీ కాలనీకి చెందిన కల్పనకు 22ఏండ్ల క్రితం మన్సూరాబాద్‌కు చెందిన అమృత్‌తో వివాహం జరిగిందని, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. పెండ్లి అయినప్పటి నుండే తరుచూ డబ్బులు ఇవ్వాలని, అదనపు కట్నం తేవాలని అమృత్‌ భార్యను వేధించేవాడని వివరించారు. 2013 అక్టోబర్‌లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, విచారణ అనంతరం కోర్టు నిందితునికి జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.

1738
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles