మోతె : వ్యవసాయ బావిలో దూకిన భార్యను రక్షించబోయి భర్త మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం రావిపహాడ్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన మేడిపల్లి రవి(32), జ్యోతి భార్యాభర్తలు. వారిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా జ్యోతి ఊరి బయట ఉన్న వ్యవసాయ బావిలో దూకింది. ఆమెను రక్షించేందుకు రవి బావిలో దూకాడు. ఇద్దరూ బయటకు రాకపోవడంతో వాళ్లిదరిని రక్షించేందుకు రవి తండ్రి కూడా బావిలో దూకాడు. జ్యోతి దరికి చేరుకోగా, రవి బావిలోనే మునిగిపోయాడు. తండ్రి ఎలాంటి ప్రమాదం జరుగకుండా ప్రాణంతో బయట పడ్డాడు. మృత్యుడికి పాప, బాబు ఉన్నారు. తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు మోతె ఎస్ఐ గోవర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.