భార్య, కుమారుడిపై కత్తితో దాడి చేసి...

Sat,April 20, 2019 05:30 PM

husband attacking with a knife on wife and son at patancheru ps limits

సంగారెడ్డి: జిల్లాలోని పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ముత్తంగి శివారు నాగార్జున కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సుబ్బారావు అనే వ్యక్తి ఏషియన్‌ పెయింట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య లక్ష్మీబాయితో గొడవపడిన సుబ్బారావు కత్తితో భార్యను, అడ్డువచ్చిన కుమారుడిని నరికి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు(10) అక్కడికక్కడే మృతి చెందగా, వారి కేకలు విన్న స్థానికులు తలుపులు పగులగొట్టి లక్ష్మీబాయిని ఆస్పతికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య, భర్తలు ఇద్దరిది రెండో వివాహం.

2269
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles