భార్య పై భర్త దాడి

Fri,July 19, 2019 09:14 PM

Husband attack on his wife

దౌల్తాబాద్: భార్య భర్తల మధ్య మనస్పర్థలతో భర్త విచక్షణ రహితంగా భర్యపై దాడి చేసిన సంఘటన దౌల్తాబాద్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కమ్మారి గోవిందమ్మకు తిర్మాలపూర్‌కు చెందిన నారాయణతో18 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. అయితే గత సంవత్సర కాలం నుంచి భార్య భర్తలు విడివిడిగా ఉంటున్నారు. దౌల్తాబాద్ పీఏసీఎస్ కాంప్లెక్స్‌లో భర్త కిరాణ దుకాణం, భార్య బేకరీ పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. కొంత కాలంగా ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధల కారణంగా శుక్రవారం షాపులో ఉన్న భార్యపై భర్త కత్తితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. దాడిలో గాయపడిన గోవిందమ్మ పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సతీశ్, పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని గోవిందమ్మను హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. దాడికి పాల్పడిన భర్త నారాయణ పోలీసుల అదుపులో తీసుకున్నారు. వీరికి ఇద్దరూ కుమారులు ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

1490
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles