చౌటుప్పల్‌లో ట్రాఫిక్ రద్దీ

Sun,October 21, 2018 09:06 PM

Huge Traffic Jam at Choutuppal Panthangi Toll Plaza

చౌటుప్పల్ : చౌటుప్పల్ రహదారి ఆదివారం సాయంత్రం అత్యంత రద్దీగా మారింది. వందలాది కార్లు, మోటార్ సైకిళ్లు, బస్సులు తదితర వాహనాల తాకిడితో రద్దీ నెలకొన్నది. దసరా సెలవులకు వివిధ ప్రాంతాలకు తరలివెళ్లిన హైదరాబాద్ వాసులు సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణమయ్యారు. ఆంధ్రాతోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు వెళ్లిన వారు తమ పిల్లాపాపలతో తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. వీరందరూ చౌటుప్పల్ మీదుగా వెళ్లడంతో ఆదివారం మొత్తం జాతీయ రహదారి వాహనాల తాకిడితో రద్దీగా మారింది. ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

గూడూరు టోల్‌ప్లాజా వద్ద..

బీబీనగర్ : మండలంలోని గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం భారీ రద్దీ నెలకొన్నది. దసరా సెలవులు ముగియడంతో స్వగ్రామాలకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ వెళ్తుండటంతో టోల్‌ప్లాజా వద్ద సాయంత్రం రద్దీ నెలకొంది. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రద్దీ దృష్ట్యా ఆరు కౌంటర్లకు గానూ మరో రెండు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు.

1690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles