తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

Sun,October 13, 2019 07:35 AM

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోగదులన్నీ భక్తుతో నిండినవి, భక్తులు బైట రెండు కిలోమీటర్ల మేర లైన్ లో వేచి ఉన్నారు,. సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 1,01,371 భక్తులు మంది దర్శించుకున్నారు. 51,171 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. దసరా సెలవులు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు.

427
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles