బెల్లం ప్రసాదాలకు భలే గిరాకీ

Thu,May 16, 2019 10:01 PM

huge demand for jaggery laddoos in bhadradri temple

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం నుంచి బెల్లంతో తయారు చేసిన లడ్డూ, పొంగలి, రవ్వకేసరిని విక్రయిస్తున్నారు. పంచదారతో చేసిన ప్రసాదాలతో పాటు బెల్లంతో తయారు చేసిన ప్రసాదాలను కూడా భక్తులకు అందుబాటులో ఉంచడంతో వీటికి భాగా గిరాకీ పెరుగుతోంది. తొలి రోజు బుధవారం 1200 లడ్డూలు తయారు చేయగా 1200 లడ్డూలు, 3 కిలోల పొంగలి, రవ్వకేసరి తయారు చేయగా గంటలోపే వీటిని భక్తులు కొనుగోలు చేశారు.

వీటి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని గురువారం దేవస్థానం స్వల్పంగా వాటి తయారీని పెంచగా, అవి కూడా అతికొద్ది సమయంలోనే అమ్ముడుపోయాయి. ఈ బెల్లం ప్రసాదాలు భక్తులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. రుచితో పాటు నాణ్యత కూడా ఉండటంతో వీటిని భక్తులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం లేకపోవడంతో కొద్ది మొత్తంలోనే తయారు చేసి భక్తులకు విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో వీటి తయారీ మోతాదు పెంచనున్నట్లు దేవస్థానం ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు తెలిపారు.

1848
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles