హైటెక్ సిటీలో హౌరాబ్రిడ్జి

Tue,June 21, 2016 10:06 AM

Howrah Bridge in Hitech City

హైదరాబాద్ : నగరంలోని హైటెక్ సిటీ పరిధిలో దుర్గంచెరువుపై నిర్మించనున్న వేలాడే వంతెన నగరానికి మణిహారంలా మారనుంది. ఈ వంతెన కోల్‌కతాలోని హౌరాబ్రిడ్జి తరహాలో ఉండనున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 నుంచి దుర్గంచెరువు మీదుగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని హైటెక్‌సిటీ, మాదాపూర్ ఇనార్బిట్‌మాల్ వరకు వంతెన నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ఇదివరకే తెలియజేసింది.

మాదాపూర్, హైటెక్‌సిటీలలో పెరిగిన రద్దీని తగ్గించడంలో భాగంగా ఈ బ్రిడ్జి నిర్మాణపనులు తెరపైకి వచ్చాయి. దీంతోపాటు దుర్గంచెరువు చుట్టూ నిర్మించనున్న ట్రాక్ పనుల బాధ్యతను పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కు అప్పగించింది. సదరు ప్రాజెక్ట్‌కు అయ్యే ఖర్చును జీహెచ్‌ఎంసీ భరించనుంది. రూ. 200 కోట్లతో దాదాపు 350 మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. దీనికి తోడు పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ శాఖలు కలిసి ఈ ప్రాంతంలోని తొమ్మిది ప్రధాన రహదారుల అభివృద్ధికి సన్నాహాలు చేస్తున్నారు. గచ్చిబౌలి-మీనాక్షి టెక్‌పార్క్(పాత బాంబేహైవే), మాదాపూర్ మెయిన్‌రోడ్డు-దుర్గంచెరువు సమీపంలోని ఇనార్బిట్‌మాల్, మాదాపూర్ (రత్నదీప్ సమీపంలో)-రహేజా పార్క్, విప్రో జంక్షన్-గోపన్‌పల్లి, నల్లగండ్ల-గోపన్‌పల్లి ఐటీ బిల్డింగ్స్, నానక్‌రాంగూడ ఎక్స్‌ప్రెస్‌వే జంక్షన్-ఫోనిక్స్ ఇన్ఫోసిటీ మార్గాలను అభివృద్ధి చేయనున్నారు.

2644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles