త్వరలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ హాస్టళ్లు

Fri,July 20, 2018 08:13 AM

hostels in Telangana government degree colleges

హైదరాబాద్ : ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల ఏర్పాటుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం తొమ్మిది హాస్టళ్ల కోసం ప్రతిపాదనలు పంపగా ఐదింటికి ఆమోదం తెలిపింది. ప్రతి హాస్టల్ నిర్మాణానికి రూ.2 కోట్ల చొప్పున రూ.10 కోట్లు కేటాయించింది. భవిష్యత్తులో మరికొన్ని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణం కోసం ఏఐసీటీఈ అనుమతి తెలిపేలా చర్యలు చేపడుతామని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ మూర్తి తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కూడా ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని రాష్ట్ర కళాశాలల విద్యా కమిషనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు.

2184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles