అగ్రికల్చర్, హార్టికల్చర్ పోస్టుల తుది జాబితా విడుదల

Mon,March 20, 2017 07:45 PM

హైదరాబాద్ : అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. 114 అగ్రికల్చర్, 73 హార్టికల్చర్ ఉద్యోగాలను భర్తీ చేసింది టీఎస్‌పీఎస్సీ. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దివ్యాంగుల కోటాలో అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో కొన్ని పోస్టులను భర్తీ చేయలేదు. 75 హార్టికల్చర్ ఉద్యోగాలకు, 120 అగ్రికల్చర్ ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నియామకాలు చేపట్టిన విషయం విదితమే. హార్టికల్చర్ పోస్టులకు 2015, అక్టోబర్ 17, 18న, అగ్రికల్చర్ ఉద్యోగాలకు 2015, అక్టోబర్ 17న రాతపరీక్ష నిర్వహించారు.

586

More News

మరిన్ని వార్తలు...