నిమజ్జనం నేపథ్యంలో 4.5 నిమిషాలకో మెట్రో రైలు

Thu,September 12, 2019 07:20 AM

HMR runs metro trains with every 4.5 minutes for Ganesh immersion


హైదరాబాద్ : హుస్సేన్‌సాగర్‌ తీరంలో జరిగే వినాయక మహా నిమజ్జన ఘట్టాన్ని తిలకించేందుకు నగరంలో వివిధ ప్రాంతాలతో పాటు జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదనంగా మెట్రో సర్వీసులతో పాటు 4.5 (నాలుగున్నర) నిమిషాలకో రైలు నడుపుతామని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. సాధారణంగా మియాపూర్‌, ఎల్బీనగర్‌ నుంచి రాత్రి 10.30 గంటలకు చివరి మెట్రో రైళ్లు బయల్దేరుతాయని, గురువారం మాత్రం భక్తుల రద్దీని బట్టి ఆర్ధరాత్రి అనంతరం (అవసరాన్ని బట్టి) బండ్లు నడుపుతామని చెప్పారు. బస్సులు, ఇతర వాహనాల కంటే మెట్రో సౌకర్యంగా ఉంటుందని, ఖైరతాబాద్‌ వరకు సులువుగా మెట్రోలో చేరుకునే అవకాశం ఉండడంతో మెట్రోరైలు సమయాన్ని పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

579
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles