హెచ్‌ఎండీఏలో మరో అవినీతి తిమింగళం

Fri,June 8, 2018 06:26 AM

HMDA EX Officer purushottam rearrested

హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రణాళిక విభాగంలో మరో అవినీతి తిమింగళం అవినీతి నిరోధక శాఖకు చిక్కడం సంస్థలో చర్చనీయాంశమైంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇద్దరు ముఖ్య అధికారులు ఏసీబీకి చిక్కడం ఉద్యోగుల్లో కలకలం రేపుతుంది. గత ఫిబ్రవరిలో ప్లానింగ్ డైరెక్టర్ కె. పురుషోత్తం రెడ్డి చిక్కి నేటికి కస్టడిలోనే ఉన్న సమయంలోనే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న సమాచారంతో ఇంఛార్జి ప్లా నింగ్ ఆఫీసరు (పీవో) భీం రావు ఇంటిపై గురువారం ఏసీబీ దాడులు జరిపింది.

డీటీసీపీకి చెందిన భీం రావు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వెస్ట్‌జోన్‌లో పనిచేసి దాదాపు రెండున్నర ఏళ్ల క్రితం హెచ్‌ఎండీఏలో డిప్యూటేషన్‌పై ఏపీవో హోదాలో బాధ్యతలు తీసుకున్నాడు. ప్రస్తుతం శంకర్‌పల్లి జోన్‌కు ఇం ఛార్జి పీవో (ప్లానింగ్ ఆఫీసర్)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అనుమతుల మంజూరులో నిర్మాణరంగదారులకు ముప్పుతిప్పలు పెట్టడం, చేయి తడిపితే సంబందిత దరఖాస్తులను క్లియర్ చేయడం, కోర్టు కేసులో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌లను క్లియర్ చేశారన్న విమర్శలు ఉన్నాయి. పురుషోత్త రెడ్డి అంశం నేపథ్యంలో హెచ్‌ఎండీఏలోని ప్లానింగ్ విభాగం కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఏసీబీ మఫ్టీలో సంస్థ ప్రధాన కార్యాలయానికి వచ్చి ఆరా తీస్తున్నారు. ఒక్క పక్క పురుషోత్తం రెడ్డి కేసు విచారణను ముమ్మరం చేసి మరో పక్క అవినీతి అధికారులపై దాడులు కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఏసీబీలో జాబితాలో మరో ఇద్దరు ప్లానింగ్ అధికారులు ఉన్నట్లు అధికార వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. ప్లానింగ్‌లో కీలక మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆ ఇద్దరిపై ఏసీబీ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

సంస్కరణలెన్నీ వచ్చినా ఆగని అవినీతి


హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సంస్థలో అనుమతి పొందాలంటే చేయి తడపాల్సిందేనన్న బలమైన అపవాదు ఉంది. ప్రభుత్వం అవినీతి రహిత అనుమతుల కోసం సంస్కరణలు చేపడుతుంటే మరోపక్క కొందరు అధికారులు ధనార్జనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అనుమతుల జారీలో డీపీఎంఎస్ విధానం ద్వారా పారదర్శక అనుమతులు మంజూరు అవుతున్నాయి. ఐతే నాణా నికి మరో పక్క అన్నట్లుగా ఈ డీపీఎంఎస్ లొసుగులను ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు ఎజెంట్లు, చేయి తిరిగిన అర్కిటెక్చర్లు, ప్లానర్లతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా తతంగం నడుపుతున్నట్లు విమర్శలు ఉన్నాయి.

1468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS