వ్యక్తిత్వవికాసంపై డాక్టర్ హిప్నో కమలాకర్‌తో ముఖాముఖి

Sat,April 30, 2016 06:48 AM

Hipno Padma Kamalaker talks on Personality Development

హైదరాబాద్ : మానసిక సమస్యలు, వ్యక్తిత్వ వికాసంపై ముఖాముఖి, శిక్షణ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నట్లు స్త్రీ శక్తి పురస్కార్ గ్రహిత డాక్టర్ హిప్నో పద్మాకమలాకర్ చెప్పారు. సమాజంలో శారీక అనారోగ్యాల కంటే మానసిక అనారోగ్యాలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు మానసిక ఆరోగ్య రక్షణ చర్యలపై అవగాహన కలిగించడానికి ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సంచలన స్టేజ్ హిప్నొటిస్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ హిప్నొ కమలాకర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. శనివారం సాయంత్రం 5.30 గంటలకు అశోక్‌నగర్‌లోని మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరుగుతుందన్నారు.

1194
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS