భానుడి భగభగ.. ఆసిఫాబాద్‌లో 45 డిగ్రీలు నమోదు

Thu,April 25, 2019 07:07 PM

highest temperature recorded in asifabad dist

కుమ్రం భీం ఆసిఫాబాద్: జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ మండుతున్నది. గురువారం జిల్లాలో 45 డిగ్రీలు గరిష్టంగా నమోదైంది. మిట్ట మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. సాయంత్ర ఐదు దాటితే గాని రహదారులపై జనం కనిపించడం లేదు. గత వారం రోజులుగా 43 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బతో జనం విలవిల్లాడుతున్నారు. గతేదాది మే నెలాఖరు వరకు సాధారణ పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వారం రోజుల నుంచి పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.

1082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles