హైదరాబాద్‌లో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

Mon,April 25, 2016 04:21 PM

highest temperature in hyderabad of 45 degrees

హైదరాబాద్: సూర్యుడు అగ్ని గోళాన్ని తలపిస్తున్నాడు. ప్రచండ మార్తాండుడు ప్రచండ రూపం దాల్చాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. పది జిల్లాల్లో భానుడు భగభగ మండిస్తున్నాడు. ఎండ తీవ్రతకు ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఇవాళ రాజధాని హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండం-44, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

2495
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles