వినియోగదారులకు అన్ని రకాలుగా సహాయం

Sat,August 17, 2019 09:02 PM

Help customers in all sorts of ways says Akun sabharwal

హైదరాబాద్: వినియోగదారుల్లో చైతన్యం కల్పించడం ద్వారానే వారి హక్కులకు రక్షణ కల్పించవచ్చని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల కమిషనర్ అకున్ సభర్వాల్ అన్నారు. నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో వినియోగదారుల పరిరక్షణ చట్టం, 2019పై శనివారం జాతీయ సదస్సును నిర్వహించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ తెలంగాణ కన్సూమర్ ఆర్గనైజేషన్ (క్యాట్‌కో) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా అకున్ సభర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. సినీతారలు ప్రచారం చేస్తే ఉత్పత్తిలో లోపం ఉంటే ప్రచారకర్తలపై కూడా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు యువతను మరింత ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. వినియోగదారులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు తాము ప్రభుత్వం తరపున సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

984
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles