హీరా గ్రూపు సంస్థల మేనేజర్‌ మాలీ థామస్‌ అరెస్ట్

Fri,November 16, 2018 06:48 AM

Heera groups Manager arrested

హైదరాబాద్ : ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించి కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన హీరా సంస్థల నౌహీరా షేక్ కేసులో గురువారం సీసీఎస్ పోలీసులు మరో కీలక నిందితురాలు మాలీ థామస్‌ను అరెస్టు చేశారు. మాలీథామస్ హీరా గ్రూపు సంస్థల ఛైర్మన్ నౌహీరా షేక్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా, సంస్థకు మేనేజర్‌గా పనిచేసింది. దేశవ్యాప్తంగా హీరా సంస్థలకు చెందిన 79 బ్రాంచీలు, విదేశి బ్రాంచీలలో జరిగిన లావాదేవీలను మాలీథామస్ పర్యవేక్షించినట్లు తేలింది.

అదే విధంగా మాలీ థామస్ 430 మంది మార్కెటింగ్ ఏజెంట్లను నియమించుకొని డిపాజిట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలిసింది. ఈ నేపథ్యంలో ఆమె పాత్రకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించి గురువారం అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం హీరా గ్రూపు సంస్థల ఛైర్మన్ నౌహీరా షేక్ ముంబయి థానే పోలీసు కస్టడీలో ఉంది.

1154
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles