హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

Sat,January 12, 2019 09:27 AM

heavy traffic jam at hyderabad-vijayawada highway

హైదరాబాద్: సంక్రాంతి సెలవులొచ్చాయ్. దీంతో నగర వాసులు సొంతూళ్ల బాట పట్టారు. గత వారం రోజల నుంచే నగర వాసులు తమ సొంతూళ్లకు పయనమయినప్పటికీ.. విజయవాడ రూట్‌లో రద్దీ మాత్రం తగ్గట్లేదు. ఇవాళ వీక్ ఎండ్ కావడం.. ఐటీ ఉద్యోగులకు ఇవాళ్టి నుంచి సంక్రాంతి సెలవులు ఉండటంతో సెలబ్రేషన్స్‌ను సొంతూరులో జరుపుకోవడం కోసం చాలామంది పయనమయ్యారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి. దాదాపు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. దానికి తోడు తెల్లవారుజాము నుంచి నగరాన్ని పొగమంచు కమ్మేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురువుతోంది.

1391
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles