రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు

Sat,April 1, 2017 02:49 PM

heavy sun stroke in state

హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకే భానుడు భగభగమంటున్నాడు. చాలా చోట్ల సాధారణంకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాలు బయట పెట్టాలంటేనే ప్రజలు జంకుతున్నారు. పిల్లలు, వృద్ధులు వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప పగటిపూట ప్రయాణం చేయొద్దని చెబుతున్నారు. చాలాచోట్ల మధ్యాహ్నం కాగానే రోడ్లన్ని నిర్మాణుష్యంగా మారుతున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వరంగల్, రామగుండం, కొత్తగూడెం, కరీంనగర్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోట్‌బెల్ట్ ఏరియాలో ఉష్ణోగ్రతలు హెచ్చుగా ఉన్నాయి. కాగా, వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని పర్వతగిరి మండలం సోమారం గ్రామానికి చెందిన మహ్మద్ షరీఫుద్దీన్ (58) అనే వృద్ధుడు వడదెబ్బ తగిలి మృతిచెందాడు.

1802
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles