రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

Sun,May 26, 2019 09:38 PM

heavy rush of devotees in vemulawada temple

* దర్శనానికి 5వేల మంది రాక
* ఆలయానికి రూ.4 లక్షల ఆదాయం

వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయం ఇవాళ భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువ జాము నుంచే భక్తులు పవిత్ర ధర్మగుండంలో స్నానాలు ఆచరించి, తలనీలాలను సమర్పించుకొని క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని ప్రీతిమొక్కైన కోడెమొక్కు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భగుడిలో నిర్వహించుకునే పలు ఆర్జిత సేవలైన అభిషేకపూజలు, అన్నపూజలు, ఆకుల పూజలను ఆలయ అధికారులు రద్దుచేశారు. దీంతో ఆలయంలోని వెనక భాగంలో ఉన్న సోమేశ్వరస్వామివద్ద భక్తులు అభిషేక పూజలు నిర్వహించుకున్నారు. రాజన్నను దాదాపు 5 వేల మంది భక్తులు దర్శించుకోగా, వివిధ ఆర్జిత సేవల ద్వారా సుమారు రూ.4 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు. సోమవారం దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు.

1842
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles