వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం

Mon,May 20, 2019 09:00 PM

heavy rush of devotees in vemulawada rajanna temple

* 30 వేలకు పైగా భక్తుల రాక
* రూ.18 లక్షల ఆదాయం

వేములవాడ: వేసవి సెలవుల దృష్ట్యా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ఇవాళ భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచే భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడెమొక్కు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో భక్తులు నిర్వహించుకునే ఆర్జితసేవలను అధికారులు రద్దుచేశారు. ఆలయంలో వివిధ ఆర్జితసేవల ద్వారా రాజన్నకు సుమారు రూ.18 లక్షల ఆదాయం సమకూరినట్లు, రాజన్నను సుమారు 30 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్ది భక్తులు తొందర తొందరగా దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణ సీఐ వెంకటస్వామి గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

1262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles