భక్తి పారవశ్యం.. లొద్దిమల్లయ్య క్షేత్రం భక్తులతో కిటకిట

Fri,July 12, 2019 10:13 PM

heavy rush of devotees in loddi mallaiah temple in mahabubnagar dist

మహబూబ్‌నగర్: శుక్రవారం ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి పర్వదినాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లాలోని మన్యంకొండ, కురుమూర్తి స్వామిని వేలాదిగా భక్తులు దర్శించుకున్నారు. దర్శనం కోసం గంటల తరబడి బారులు తీరారు.

అమ్రాబాద్ మండలంలోని దట్టమైన అడవిలో వెలిసిన లొద్ది మల్లయ్య, మల్లెల తీర్థం క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై మన్ననూర్ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగమయ్య స్వామికి ఇక్కడి చెంచులే పూజారులుగా వ్యవహరిస్తారు.

3 కిలోమీటర్ల మేర కాలినడకన భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. సుమారు 15వేల మంది భక్తులు దర్శించుకున్నారు. శంభో శంకర హర హర మహదేవా.. వస్తున్నాం లింగమయ్య.. వెళ్లోస్తాం లింగమయ్య అనే నామస్మరణతో నల్లమల మార్మోగిపోయింది.

499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles